Hyderabad: ముగిసిన గడువు.. రూ. 302 కోట్ల ట్రాఫిక్ చలానాల వసూలు
- 5 కోట్ల పెండింగ్ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలు
- మొత్తంగా రూ. 1,015 కోట్ల చలానాలు జారీ
- గడువు పెంపును సద్వినియోగం చేసుకున్న వాహనదారులు
పెండింగ్ చలానాలను రాయితీపై చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన గడువు నిన్నటితో ముగిసింది. చివరి రోజు కూడా చలానాలు భారీగా వసూలయ్యాయి. నిజానికి ఈ గడువు ఇదివరకే ముగియగా, ఈ నెల 15 వరకు దానిని పొడిగించింది. దీంతో గతంలో చెల్లించలేకపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
నిన్న రాత్రి 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 302 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా ఐదు కోట్ల పెండింగ్ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం రూ.1,015 కోట్ల చలానాలు జారీ చేయగా, రాయితీ పోను రూ. 302 కోట్లు వసూలైనట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.