TRS: 27న టీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ‌... 11 తీర్మానాలుంటాయన్న కేసీఆర్‌

trs formation day celebrations on 27th of this month

  • మాదాపూర్ హెచ్ఐసీసీలో వేడుక‌లు
  • ఉద‌యం 11.05 గంట‌ల‌కు పార్టీ ప‌తాకం ఆవిష్క‌ర‌ణ‌
  • ప్ర‌త్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు

తెలంగాణ‌లో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) ఆవిర్భావ వేడుక‌ల‌ను ఈ నెల 27న నిర్వ‌హించ‌నున్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌ల‌కు సంబంధించి కాసేప‌టి క్రితం పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం 27న ఉద‌యం 11.05 గంట‌ల‌కు పార్టీ ప‌తాకాన్ని ఆవిష్క‌రిస్తారు. ఆవిర్భావ స‌మావేశంలో 11 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. ఈ వేడుక‌ల‌కు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజ‌రు కానున్నారు.

  • Loading...

More Telugu News