Mumbai Indians: ముంబయి ఇండియన్స్ కు మళ్లీ నిరాశే... ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్
- వరుసగా ఆరో మ్యాచ్ లోనూ ఓడిన ముంబయి
- 200 పరుగుల ఛేదనలో 181/9
- కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయిన ముంబయి
- పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి లక్నో
ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు ఏమాత్రం కలిసిరావడంలేదు. ఇవాళ కూడా ఓటమిపాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో భారీ లక్ష్యఛేదనలో పోరాడి ఓడింది. 200 పరుగుల ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ముంబయి జట్టుకు విజయం సాధించేందుకు అవకాశాలు లభించినా, కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది.
ముంబయి ఇన్నింగ్స్ లో డివాల్డ్ బ్రెవిస్ 31 పరుగులు (13 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ 37, తిలక్ వర్మ 26 పరుగులు చేశారు. ఆఖర్లో కీరన్ పొలార్డ్ (14 బంతుల్లో 25) విజృంభించినా, అతడికి సహకారం అందించేవాళ్లు కరవయ్యారు. భారీ షాట్లు కొట్టే యత్నంలో అవుటయ్యారు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 3, జాసన్ హోల్డర్ 1, దుష్మంత చమీర 1, రవి బిష్ణోయ్ 1, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు.
కాగా, ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు ఇది ఆరో ఓటమి. తద్వారా ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించినట్టయింది. ఇక, ముంబయి వరుసగా మ్యాచ్ లు గెలిచినప్పటికీ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే భావించాలి. అటు, లక్నో సూపర్ జెయింట్స్ తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్