Somu Veerraju: కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు దేవాలయాల నిధులు ఇవ్వడం ఏంటి?: సోము వీర్రాజు

Somu Veerraju fires om AP Govt
  • ఏపీలో కొత్త జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన కార్యాలయాల ఏర్పాటు
  • ఆలయాల నుంచి నిధులు సేకరిస్తున్నారన్న వీర్రాజు 
  • దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
ఏపీలో ఇటీవల 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే, కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు హిందూ దేవాలయాల నుంచి నిధులు సేకరించాలని చూస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రభుత్వంపై మండిపడ్డారు. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం దేవాలయాల నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అదే జరిగితే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 

అంతేగాకుండా, కొత్త జిల్లాలు ఏర్పడగానే అమ్మ ఒడికి నిబంధనలు పెట్టారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇలాంటి తుగ్లక్ చర్యలను తాము అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. అమ్మ ఒడి తొలి ఏడాది ఎలా ఇచ్చారో, ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Somu Veerraju
Govt Offices
New Districts
YSRCP
BJP
Andhra Pradesh

More Telugu News