sensex: ఇన్వెస్టర్లలో ఆందోళన.. సెన్సెక్స్ 1200 పాయింట్ల డౌన్

sensex plunges above 1200 points

  • 322 పాయింట్ల వరకు నష్టపోయిన నిఫ్టీ 
  • మదుపరులలో ద్రవ్యోల్బణంపై భయాలు
  • రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం

స్టాక్ మార్కెట్ మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సోమవారం మన ఈక్విటీ సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1200 పాయింట్ల నష్టంతో ఉంటే, నిఫ్టీ 322 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ప్రధాన సూచీలు రెండు శాతం వరకు నష్టపోయాయి. 

చైనా జీడీపీ గణాంకాలు, కరోనా కేసులు పెరుగుతుండడం, వైరస్ నిరోధానికి విధిస్తున్న ఆంక్షలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ద సంక్షోభం.. ఇవవ్నీ అమ్మకాల ఒత్తిళ్లకు దారితీశాయి. అధిక ముడి చమురు ధరలు, కమోడిటీల ధరలతో ద్రవ్యోల్బణం రిస్క్ పైనా ఆందోళన నెలకొంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్నాం. ఈ ధరాభారం కంపెనీల మార్జిన్లను దెబ్బతీస్తున్న అంచనాలు నెలకొన్నాయి.

గతవారం ఫలితాలు ప్రకటించిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ కౌంటర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. వీటి ఫలితాలు అంచనాలను అందుకోలేదు. ఈ రెండు స్టాక్స్ వల్లే సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు కొంత కాలంనుంచి నికర విక్రయదారులుగా ఉంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News