Norovirus: ఐదేళ్లలోపు చిన్నారుల్లో నోరోవైరస్.. హైదరాబాద్ లో ఐదు కేసులు
- గాంధీ ఆసుపత్రి పరిశోధకుల అధ్యయనం
- 458 మంది పిల్లల మల నమూనాల పరీక్ష
- వైరస్ సోకిన వారిలో వాంతులు, నీళ్ల విరేచనాలు, డీహైడ్రేషన్
- వైద్యులను సంప్రదించడమే మంచిది
ఒకవైపు కరోనా వైరస్ మరో విడత వస్తుందేమోనన్న భయం ప్రజల్లో ఉంటే.. మరోవైపు హైదరాబాద్ లో నోరోవైరస్ కేసులు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. ఐదేళ్లలోపు ఐదుగురు చిన్నారుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. గాంధీ ఆసుపత్రి, ఎల్లా ఫౌండేషన్ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
వాంతులు, నీళ్ల విరేచనాలు కనిపిస్తాయి. డీహైడ్రేషన్ కు గురి అవుతారు. ఉన్నట్టుండి నీరసపడిపోతారు. వళ్లు కొంచెం వెచ్చపడుతుంది. కడుపులో నొప్పి రావచ్చు. ప్రధానంగా వాంతులు, విరేచనాలతో వారి శరీంలోని నీటి శాతం, లవణాల శాతం తగ్గిపోతుంది. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు రిస్క్ ఏర్పడొచ్చు.
తగినంత విశ్రాంతి ఇవ్వాలి. శిశువులు అయితే పాలు ఇవ్వడం ఆపకూడదు. ద్రవ పదార్థాలు తగినంత ఇస్తూ ఉండాలి. గదిలో వేడి వాతావరణం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఒకటి రెండు విరేచనాలు, వాంతులకు కంగారు పడిపోనక్కర్లేదు. అవి కంట్రోల్ కాకపోతే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.