Sunil Gavaskar: సెంచరీ చేసినప్పుడు కేఎల్ రాహుల్ చెవులు మూసుకోవడంపై గవాస్కర్ స్పందన

Sunil Gavaskar opines on KL Rahul century gesture by closing ears and eyes
  • సెంచరీ చేయగానే రాహుల్ చిత్రమైన చర్య
  • చెవులు, కళ్లు మూసుకుని కాసేపు మౌనం
  • ప్రజల నుంచి వచ్చే అభినందనలు వినాలన్న గవాస్కర్
  • విఫలమైనప్పుడు చెవులు మూసుకుంటే తప్పులేదని వ్యాఖ్యలు
భారత జట్టులో అన్ని తరహా క్రికెటింగ్ షాట్లు ఆడగలిగిన బ్యాట్స్ మన్లలో కేఎల్ రాహుల్  ఒకడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో రాహుల్ సూపర్ సెంచరీ సాధించాడు. శతకం పూర్తికాగానే ఎప్పట్లాగానే తన ట్రేడ్ మార్కును ప్రదర్శించాడు. చెవులు రెండు మూసుకుని ఏదో ధ్యాన ముద్రలో ఉన్నవాడిలా కాసేపు మౌనం పాటించాడు. కేఎల్ రాహుల్ ఇప్పుడే కాదు, టీమిండియాకు ఆడే సమయంలోనూ సెంచరీ చేస్తే ఇలాగే చెవులు మూసుకుంటాడు. 

దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. రాహుల్ సెంచరీ చేసిన తర్వాత చెవులు ఎందుకు మూసుకుంటాడో తనకు అర్థం కాదని అన్నారు. చెవులు మూసుకోవడం ద్వారా ఫ్యాన్స్ నుంచి వచ్చే అభినందనలు, ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అతడు వినలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. కానీ అది తప్పు అని, కేఎల్ రాహుల్ సెంచరీ చేయగానే ప్రజల నుంచి వచ్చే అభినందనలను స్వీకరించాలని స్పష్టం చేశారు. ప్రేక్షకుల నుంచి వచ్చే గౌరవాభిమానాలను ఆస్వాదించాలని సూచించారు. రాహుల్ స్వల్ప స్కోర్లకు అవుటైనప్పుడు చెవులు మూసుకుంటే బాగుంటుందని హితవు పలికారు.
Sunil Gavaskar
KL Rahul
Century Gesture
IPL
Team India

More Telugu News