Telangana: కొత్త స‌చివాల‌యానికి కేసీఆర్‌.. ప‌నుల‌ను ప‌రిశీలించిన‌ సీఎం!

cm kcr inspects new secretariat works

  • ద‌స‌రా నాటికి అందుబాటులోకి నూత‌న స‌చివాల‌యం
  • 70 శాతం మేర పూర్తయిన స‌చివాల‌య నిర్మాణాలు
  • స‌చివాల‌యానికి నాలుగు దిక్కులా ప్ర‌వేశ‌ద్వారాలు
  • అధునాత‌న హంగుల‌తో కాన్ఫ‌రెన్స్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నామ‌న్న అధికారులు

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో నూత‌నంగా నిర్మిస్తున్న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌రిశీలించారు. ప‌నులు కొన‌సాగుతున్న వేగంపై సీఎం సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌నుల పురోగ‌తిపై కేసీఆర్ అధికారుల‌తో చ‌ర్చించారు. 

సీఎం కేసీఆర్ అడిగిన అన్ని వివ‌రాల‌ను తెలిపిన అధికారులు... ద‌స‌రా నాటికి కొత్త స‌చివాల‌యం అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలియజేశారు. స‌మీకృత స‌చివాల‌య ప‌నుల్లో ఇప్ప‌టికే 70 శాతం మేర‌ పూర్తయ్యాయ‌ని, మిగిలిన ప‌నుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

6 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మిత‌మ‌వుతున్న‌ కొత్త స‌చివాల‌యానికి ఇక‌పై వాస్తు దోషాల స‌మ‌స్య రాకుండా నాలుగు వైపులా ప్ర‌వేశ ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం, మంత్రులు, అధికారుల స‌మావేశాల కోసం అధునాత‌న హంగుల‌తో స‌మావేశ మందిరాలు స‌చివాల‌యంలో ఏర్పాట‌వుతున్నాయి.

  • Loading...

More Telugu News