Faf Duplessis: డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్... లక్నో ఎదుట భారీ టార్గెట్
- బెంగళూరు వర్సెస్ లక్నో
- మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 రన్స్
- 96 పరుగులు చేసిన డుప్లెసిస్
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించిందంటే అందుకు కారణం కెప్టెన్ డుప్లెసిస్ ఇన్నింగ్సే. డుప్లెసిస్ 96 పరుగులు చేశాడు. దాంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది.
7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టును డుప్లెసిస్ ఆదుకున్నాడు. ఓపెనర్ అనుజ్ రావత్ 4 పరుగులకే అవుట్ కాగా, విరాట్ కోహ్లీ (0) తానెదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు దుష్మంత చమీర ఖాతాలోకి చేరాయి.
ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడాడు. మ్యాక్స్ వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26)ల సహకారంతో స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 64 బంతులు ఆడిన డుప్లెసిస్ 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో హోల్డర్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి స్టొయినిస్ కు చిక్కాడు. లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 2, జాసన్ హోల్డర్ 2, కృనాల్ పాండ్య 1 వికెట్ తీశారు.