Adimulapu Suresh: 430 చదరపు అడుగుల్లోని ఇళ్లకు లబ్దిదారుల వాటా రూ.25 వేలు మాత్రమే: మంత్రి ఆదిమూలపు సురేశ్
- పురపాలక శాఖ మంత్రిగా ఆదిమూలపు
- ఇళ్ల నిర్మాణంపై వివరణ
- డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్లు పూర్తిచేస్తామని వెల్లడి
- వచ్చే నెలలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కేటాయింపు
ఏపీలో ఇటీవల పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేశ్ రాష్ట్రంలో పేదలకు గృహాల నిర్మాణంపై స్పందించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 2.62 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ముందుగా తాగునీరు, కాలువలు, ఎస్టీపీలు వంటి మౌలిక వసతులు కల్పించి లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు.
430 చదరపు అడుగుల్లోని ఇళ్లకు లబ్దిదారుల వాటా రూ.25 వేలు మాత్రమేనని వెల్లడించారు. ఒక్కో ప్రాంతంలో దశలవారీగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, వచ్చే నెలలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్ల కేటాయింపులు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.