Rajanikanth: రజనీ సినిమా క్యాన్సిల్ కాలేదన్న 'బీస్ట్' డైరెక్టర్!

Rajani in Nelson Dileep Kumar Movie

  • ఈ నెల 13న విడుదలైన 'బీస్ట్'
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్
  • ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన సినిమా 
  • రజనీతో సినిమా క్యాన్సిల్ అంటూ ప్రచారం

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన 'బీస్ట్' భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇంతకుముందు ఆయన చేసిన 'కొలమావు కోకిల' .. 'డాక్టర్' సినిమాలు చూస్తే స్క్రీన్ ప్లేపై ఆయనకి మంచి పట్టు ఉందనే విషయం అర్థమవుతుంది.

అయితే 'బీస్ట్' సినిమాకి వచ్చేసరికి ఆయన మార్కు స్క్రీన్ ప్లే మిస్సయింది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, విజయ్ స్టైల్ తోనే చాలావరకూ నెట్టుకొచ్చింది. ఈ సినిమా విజయ్ స్థాయికి తూగకపోవడం వలన, ఆ తరువాత నెల్సన్ చేయవలసిన భారీ సినిమా క్యాన్సిల్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

సన్ పిక్చర్స్ వారే నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ తో ఆమధ్య ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే 'బీస్ట్' ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం వలన, రజనీ ప్రాజెక్టును వారు ఆపేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా పుకారు మాత్రమేననే విషయాన్ని స్పష్టం చేస్తూ, రజనీతో తన సినిమా ఉందనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెల్సన్ తెలియజేశాడు.

  • Loading...

More Telugu News