MI: గౌరవప్రదమైన స్కోరు చేసిన ముంబై... సీఎస్కే టార్గెట్ 156 పరుగులు
- 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన ముంబై
- హాఫ్ సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ
- ముఖేశ్ చౌదరి ఖాతాలో 3 వికెట్లు
ఐపీఎల్ తాజా సీజన్‌లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గౌరవ ప్రదమైన స్కోరునే చేసింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు డక్ అవుట్ అయినా...ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (51), హృతిక్ షోకీన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. చివరలో జయదేవ్ ఉనాద్కత్ (19) బ్యాటు ఝుళిపించడంతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరి 3 వికెట్లతో చెలరేగాడు. డ్వేనీ బ్రేవో 2 వికెట్లు తీసుకోగా... మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ చెరో వికెట్ తీసుకున్నారు. 156 పరుగుల విజయలక్ష్యంతో మరికాసేపట్లో చెన్నై తన బ్యాటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు కీలకం కానుంది. చెన్నై గెలిస్తే ఆ జట్టు ఖాతాలో రెండో విజయం నమోదు కానుండగా... ముంబై గెలిస్తే మాత్రం ఈ సీజన్‌లోనే తొలి విజయాన్ని అందుకోనుంది.