NI: నిప్పులు కక్కుతున్న బంతులు... తొలి బంతికే సీఎస్కే ఓపెనర్ గైక్వాడ్ అవుట్
- తొలి ఓవర్‌లోనే ముంబైకి డబుల్ షాకిచ్చిన చెన్నై
- తొలి బంతికే చెన్నైకి షాకిచ్చిన ముంబై
- చెన్నై ఇన్నింగ్స్‌లో తొలి బంతికే అవుట్ అయిన గైక్వాడ్
తాజా ఐపీఎల్ సీజన్‌లో బౌలర్లు చెలరేగుతున్నట్లే ఉంది. నిప్పులు కక్కుతున్న బంతులను విసురుతున్న బౌలర్లు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యేకించి ఇన్నింగ్స్ మొదలుపెట్టే ఓపెనర్లు ప్రత్యర్థి జట్ల బౌలర్ల ధాటికి నిలబడలేకపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా గురువారం డీవై పాటిల్ స్టేడియంలో ముంబై, చెన్నై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నిలిచింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైని చెన్నై బౌలర్ ముఖేశ్ చౌదరి హడలగొట్టేశాడు. తన రెండో బంతికే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను డక్ అవుట్ చేసిన ముఖేశ్... ఐదో బంతికి మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా అతడు మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత 156 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నైకి ముంబై బౌలర్ డేనియల్ సామ్స్ ఊహించని షాకిచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను అతడు తొలి బంతికే అవుట్ చేశాడు. దీంతో చెన్నై జట్టుకు తొలి బంతికే భారీ షాక్ తగిలింది. ఇక మూడో ఓవర్ వేసిన సామ్స్ మరో చెన్నై వికెట్‌ను పడగొట్టాడు. కాస్తంత కుదుటపడినట్టే కనిపించిన సాంట్నర్ (9)ని సామ్స్ బోల్తా కొట్టించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో బౌలర్లు సత్తా చాటుతున్నారనే చెప్పాలి.