Virender Sehwag: ధోనీ ఫినిషింగ్ పై.. సెహ్వాగ్, రైనా, హర్భజన్ ఏమన్నారు?

Virender Sehwag Harbhajan Singh Suresh Raina react after MS Dhoni wins CSK last ball thriller vs MI
  • 'ఓం ఫినిషాయ నమహ' అని కీర్తించిన సెహ్వాగ్
  • 'ఎంత చక్కగా ఆడావు' అన్న రైనా
  • గడియారంలోని ముల్లు మళ్లీ పాత రోజులకు అంటూ ఇర్ఫాన్ ట్వీట్
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ చేసిన బ్యాటింగ్ ప్రదర్శనను అందరూ మెచ్చుకుంటున్నారు. దీనిపై ప్రముఖ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, సీఎస్కే మాజీ ప్లేయర్ సురేష్ రైనా స్పందించారు.

విజయానికి కావాల్సిన 16 పరుగులను వరుసగా నాలుగు బంతుల్లో సాధించేసి ధోనీ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ చక్కని కొటేషన్ ఇచ్చాడు. ‘‘ఎంఎస్ ధోనీ... ఓమ్ ఫినిషాయ నమహ. ఎంత గొప్ప విజయం. రొంబ నల్ల’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ వదిలాడు. 'ఇది మహీ బాట' అంటూ హర్భజన్ సింగ్ సింపుల్ ట్వీట్ పెట్టాడు. కాకపోతే ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశాడు.

‘‘గడియారంలోని ముల్లు మళ్లీ వెనుకటి మంచి రోజులకు మళ్లింది’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ‘‘చక్కగా ఆడాడు ఎంఎస్ ధోనీ స్కిప్పర్’’అని రైనా స్పందించాడు. 'ఆయన పేరు ఎంఎస్ ధోనీ' అంటూ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. ‘‘అసాధారణమైన ఇదే ఈ మనిషిని ఐకాన్ గా మార్చింది. మహి మైక్రో ప్రాసెసర్ చక్కగా పని చేస్తోంది. దీని గురించి ఆందోళన చెందకండి’’ అని మురళీ కార్తీక్ ట్వీట్ పెట్టాడు.
Virender Sehwag
Harbhajan Singh
Suresh Raina
MS Dhoni
finishing

More Telugu News