Byreddy Siddharth Reddy: పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

No need for me to change the party says Byreddy Siddharth Reddy
  • తనకు బ్రోకర్ రాజకీయాలు తెలియవన్న సిద్ధార్థ్ రెడ్డి 
  • కుటిల రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలిసిందని వ్యాఖ్య 
  • తాను పార్టీ సిద్ధాంతాల కోసం పని చేసే వ్యక్తినని వెల్లడి 
వైసీపీ కర్నూలు జిల్లా నేత, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సిద్ధార్థ్ రెడ్డి స్పందిస్తూ... పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. తనకు బ్రోకర్ రాజకీయాలు తెలియవని అన్నారు. కుటిల రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. తాను పార్టీ సిద్ధాంతాల కోసం పని చేసే వ్యక్తినని అన్నారు.

ఇక నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ది స్థానిక ప్రొటోకాల్ అని... తనది రాష్ట్ర స్థాయి ప్రొటోకాల్ అని చెప్పారు. ఈ కారణం వల్లే ఇద్దరం కలవలేకపోతున్నామని తెలిపారు. తన ప్రొటోకాల్ పరిధిలోని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటానని చెప్పారు.
Byreddy Siddharth Reddy
YSRCP
Telugudesam

More Telugu News