Malaika Arora: నా కంటే చిన్నవాడితో డేటింగ్ చేస్తే తప్పేముంది: మలైకా అరోరా

Malaika Arora asks whats wrong in dating with younger man
  • 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ తో డేటింగ్ చేస్తున్న మలైకా
  • చిన్న వాడితో రిలేషన్ షిప్ లో ఉంటే సమాజం తప్పుగా ఎందుకు చూస్తోందన్న మలైకా
  • విడాకుల తర్వాత ఒక మహిళ తన జీవితాన్ని సృష్టించుకోవాలని వ్యాఖ్య
బాలీవుడ్ శృంగార తార మలైకా అరోరా తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పెద్ద ఎత్తున ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. నీ కంటే చాలా చిన్న వాడైన వ్యక్తితో ఎలా రిలేషన్ షిప్ లో ఉన్నావని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఈ విమర్శలపై మలైకా స్పందిస్తూ, తన కంటే తక్కువ వయసున్న వ్యక్తితో ఒక మహిళ రిలేషన్ షిప్ లో ఉంటే ఈ సమాజం ఎందుకు తప్పుగా చూస్తోందని అన్నారు. విడాకుల తర్వాత కానీ, బ్రేకప్ తర్వాత కానీ ఒక మహిళ తనకంటూ ఒక జీవితాన్ని సృష్టించుకోవాలని చెప్పింది. 

ప్రతి మహిళ స్వశక్తితో ముందడుగు వేయాలని సలహా ఇచ్చింది. ధైర్యంగా ఎలా జీవించాలనే విషయాన్ని అమ్మ నుంచి తాను నేర్చుకున్నానని చెప్పింది. నీకు ఏం చేయాలనిపిస్తే దాన్ని ధైర్యంగా చెయ్ అని అమ్మ చెపుతుండేదని తెలిపింది. అమ్మ చెప్పిన మాటలను తాను ఎక్కువగా నమ్ముతానని చెప్పింది.
Malaika Arora
Arjun Kapoor
Bollywood
Dating

More Telugu News