USA: అమెరికా కాలేజీలో పోర్నోగ్రఫీ క్లాసులు.. పోర్న్ సినిమాలను టీచర్లు, విద్యార్థులు కలిసి చూడొచ్చు!
- ఉతా నగరంలోని వెస్ట్‌మినిస్టర్ కాలేజీలో ప్రత్యేక కోర్సు
- ‘ఫిల్మ్ 3000’ ప్రోగ్రామ్‌లో భాగంగా హార్డ్‌కోర్ కోర్సు
- సామాజిక సమస్యలను విశ్లేషించేందుకు కోర్సు అత్యుత్తమంగా పనికొస్తుంటున్న కాలేజీ
శృంగారం ఒకప్పుడు నాలుగు గోడల మధ్య జరిగే రహస్యం. ఆ పేరెత్తితేనే చాలు అదోరకంగా చూసేవారు. కానీ కాలం మారింది. సినిమాల పుణ్యమా అని శృంగారం ఇప్పుడు బహిరంగ కార్యకలాపమైంది. పాశ్చాత్య దేశాల్లో శృంగారం గురించి చర్చించుకోవడం సర్వసాధారణమే అయినా, భారతీయులు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. అయితే, మెల్లగా ఆ దారిలో నడుస్తున్నారనే చెప్పుకోవచ్చు.
ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే, అమెరికాలోని ఓ కాలేజీ మరో అడుగు ముందుకేసింది. ‘హార్డ్‌కోర్’ పోర్నోగ్రఫీలో విద్యార్థులను తీర్చిదిద్దుతామంటూ ఓ కోర్సు ప్రకటించింది. ఈ కోర్సులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే విద్యార్థులు, లెక్చరర్లు కలిసి ఎంచక్కా తరగతి గదిలో ‘హార్డ్‌కోర్’ మూవీలు చూడొచ్చు.
ఉతా నగరంలోని వెస్ట్‌మినిస్టర్ కాలేజీ మొట్టమొదటిసారిగా ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది.‘ఫిల్మ్ 3000’ ప్రోగ్రామ్ కిందకు ఈ కోర్సు వస్తుందని తెలిపింది. జాతి, తరగతి, లింగం, ప్రయోగాత్మక, రాడికల్ కళారూపంగా లైంగికత గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా కొన్ని ఎంపిక చేసిన కోర్సులను అందిస్తుంది.
అలాగే, సామాజిక సమస్యలను విశ్లేషించేందుకు ఒక అవకాశంగా పోర్నోగ్రఫీ కోర్సును ప్రవేశపెట్టినట్టు సదరు కళాశాల చెబుతోంది. అయితే, కాలేజీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ‘పూర్తిగా అసహ్యకరమైనదని’ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ పోర్న్ తరగతులు ప్రారంభం కానున్నాయి.