Crime News: ఆంజ‌నేయ స్వామి గుడిలో అమ్మాయిపై యువ‌కుడు బ్లేడుతో దాడి

man attacks girl

  • అన‌కాప‌ల్లి జిల్లా వి.మాడుగుల‌లో దారుణ ఘ‌ట‌న 
  • ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డుతున్న న‌గేశ్ 
  • బ్లేడుతో దాడితో యువ‌తికి తీవ్ర‌ గాయాలు
  • గ‌తంలోనూ యువ‌తిపై న‌గేశ్ దాడి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన‌కాప‌ల్లి జిల్లా వి.మాడుగుల‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గుడిలో ఓ అమ్మాయిపై బ్లేడులో దాడి చేశాడు ఓ ఉన్మాది. ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా న‌గేశ్ అనే యువ‌కుడు ఓ యువ‌తి వెంట‌ప‌డుతున్నాడు. అయితే అందుకు యువ‌తి ఒప్పుకోక‌పోవ‌డంతోనే న‌గేశ్ ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 

ఈ రోజు ఉద‌యం యువ‌తి స్థానికంగా ఉండే ఆంజ‌నేయ స్వామి గుడికి వెళ్ల‌గా ఆమెను ఫాలో అయిన ఆ యువ‌కుడు అక్క‌డే ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. దీంతో యువ‌తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఆమెను స్థానికులు మాడుగుల ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందేలా చేశారు. గ‌తంలోనూ యువ‌తిపై న‌గేశ్ దాడి చేసిన ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. దీంతో అప్ప‌ట్లో పోలీసులు అత‌డిని పిలిచి హెచ్చ‌రించినా మ‌రోసారి న‌గేశ్ దాడి చేయ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News