Brian Lara: రషీద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా

Brian Lara opines on Rashid Khan

  • రషీద్ గొప్ప వికెట్ టేకింగ్ బౌలర్ కాదన్న లారా 
  • బ్యాట్స్ మెన్ కాస్త వెనక్కి తగ్గుతారని వివరణ
  • రషీద్ లేకపోయినా సన్ రైజర్స్ కూర్పు అద్భుతంగా ఉందన్న లారా

ఆఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్ లలో ఆడుతున్నాడు. ఐపీఎల్ లోనూ రషీద్ ఖాన్ స్టార్ డమ్ అందుకున్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న రషీద్ ఖాన్ గతంలో పలు సీజన్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, తాజా ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా... రషీద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

రషీద్ ఖాన్ ఏమంత గొప్ప వికెట్ టేకింగ్ బౌలర్ కాదని అన్నాడు. అతడి బౌలింగ్ ఆడేటప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకని బ్యాట్స్ మెన్ ఆలోచిస్తారని, అంతేతప్ప రషీద్ ఖానేమీ ప్రమాదకర బౌలర్ అనుకోవడంలేదని లారా అభిప్రాయపడ్డాడు. రషీద్ ఖాన్ ఎకానమీ సుమారు 6 అని, వాషింగ్టన్ సుందర్ వంటి ఆఫ్ స్పిన్నర్ కు తొలి 6 ఓవర్లలో బౌలింగ్ చేసే అవకాశం ఇస్తే అతను కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తాడని వివరించాడు. సుందర్ గాయపడడంతో బరిలో దిగిన సుచిత్ కూడా రాణిస్తున్నాడని వెల్లడించాడు. 

రషీద్ ఖాన్ లేకపోయినా సన్ రైజర్స్ జట్టు కూర్పు అద్భుతంగా ఉందని లారా స్పష్టం చేశాడు. అయితే రషీద్ పై తనకు గౌరవం ఉందని, అతడు కూడా ఉండుంటే ఈ టోర్నీలో తమకు అదనపు బలం సమకూరేదని తెలిపాడు.

  • Loading...

More Telugu News