Koti Womens College: తెలంగాణ మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ
- ఇదివరకే మహిళా విశ్వవిద్యాలయం ప్రకటన
- కోఠి ఉమెన్స్ కాలేజీని అప్గ్రేడ్ చేయనున్నట్లుగా వెల్లడి
- తాజాగా మహిళా వర్సిటీగా మారుస్తూ ఉత్తర్వుల జారీ
కొత్త రాష్ట్రం తెలంగాణకు కూడా మహిళా యూనివర్సిటీ వచ్చేసింది. హైదరాబాద్ కోఠిలోని ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నట్లు ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటను నిలబెట్టుకుంటూ కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ మహిళా యూనివర్సిటీగా కొనసాగింది. అయితే తెలుగు నేల విభజన తర్వాత పద్మావతి వర్సిటీ ఏపీకే పరిమితం కాగా...తెలంగాణకు మహిళా యూనివర్సిటీ లేకుండాపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి కూడా మహిళా యూనివర్సిటీ అవసరమన్న దిశగా ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం...ఆ మేరకు కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేసింది.