Youtube: తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయంటూ 16 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం వేటు

Union govt bans 16 youtube channels

  • ఇటీవల 22 యూట్యూబ్ చానళ్లపై వేటు
  • మరోసారి కొరఢా ఝుళిపించిన కేంద్రం
  • తాజాగా 10 దేశీయ చానళ్లపై నిషేధం
  • 6 పాకిస్థానీ చానళ్లపైనా చర్యలు 

ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల 22 యూట్యూబ్ చానళ్లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా 16 యూట్యూబ్ చానళ్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో 10 దేశీయ చానళ్లు కాగా, 6 పాకిస్థాన్ కు చెందిన యూట్యూబ్ చానళ్లు. 

"ఈ చానళ్లు సోషల్ మీడియా వేదికగా జాతీయ భద్రత, భారత విదేశీ వ్యవహారాలు, మత సామరస్యం, ప్రజాపాలనకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. కొత్త ఐటీ చట్టం-2021లో భాగంగా 18వ నిబంధన ప్రకారం ఈ యూట్యూబ్ చానళ్ల యాజమాన్యాలు తమ వివరాలను కేంద్రానికి సమర్పించలేదు" అని కేంద్ర సమాచార ప్రసార శాఖ వెల్లడించింది. 

భారత్ కు చెందిన కొన్ని యూట్యూబ్ చానళ్లలో ప్రసారమవుతున్న కథనాలను పరిశీలిస్తే, ఓ వర్గం వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నాయని, వివిధ మతాల వారి మధ్య విద్వేషాలు పురిగొల్పేలా ఉన్నాయని ఆరోపించింది. ఇక, పాకిస్థాన్ కు చెందిన యూట్యూబ్ చానళ్లలో భారత సైన్యంపైనా, జమ్ము కశ్మీర్, ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత విదేశాంగ విధానంపైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్టు వెల్లడైందని కేంద్రం తెలిపింది.

కేంద్రం నిషేధించిన యూట్యూబ్ చానళ్లు 

భారత్ కు చెందినవి...

1.సైనీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్
2. హిందీ మే దేఖో
3. టెక్నికల్ యోగేంద్ర
4. ఆజ్ తే న్యూస్
5. ఎస్బీబీ న్యూస్
6. డిఫెన్స్ న్యూస్ 24×7
7. ది స్టడీ టైమ్
8. లేటెస్ట్ అప్ డేట్
9. ఎంఆర్ఎఫ్ టీవీ లైవ్
10. తహఫ్ఫూజ్ ఈ దీన్ ఇండియా

పాకిస్థాన్ చానళ్లు ఇవే...

1. ఆజ్ తక్ పాకిస్థాన్
2. డిస్కవర్ పాయింట్
3. రియాలిటీ చెక్స్
4. కైసర్ ఖాన్
5. ది వాయిస్ ఆఫ్ ఏషియా
6. బోల్ మీడియా బోల్ 


  • Loading...

More Telugu News