Telangana: తెలంగాణ ఏర్ప‌డ్డాక‌... తొలి గ్రూప్ 1 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

tspsc issues group 1 notification

  • 503 పోస్టుల భ‌ర్తీకి గ్రూప్ 1 నోటిఫికేష‌న్‌
  • నోటిఫికేష‌న్ ‌ను జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ
  • హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న నిరుద్యోగులు

తెలంగాణ‌లో ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ల జారీలో భాగంగా మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. గ్రూప్ 1 ఉద్యోగాల భ‌ర్తీకి ఉద్దేశించిన నోటిఫికేష‌న్‌ను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) మంగ‌ళ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 503 గ్రూప్ 1 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు క‌మిష‌న్ పేర్కొంది. ఈ నోటిఫికేష‌న్ జారీతో నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించాక ఇప్ప‌టిదాకా గ్రూప్ 1 నోటిఫికేష‌నే విడుద‌ల కాలేదు. గ‌డ‌చిన ఏడేళ్ల‌లో ప‌లు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్లు జారీ అయినా.. గ్రూప్ 1 నోటిఫికేష‌న్ మాత్రం జారీ కాలేదు. దీంతో మంగ‌ళ‌వారం జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేష‌న్ ను తెలంగాణ చ‌రిత్ర‌లోనే వెలువ‌డ్డ తొలి గ్రూప్ 1 నోటిఫికేష‌న్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు.

గ్రూప్ 1 ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా ఇంట‌ర్వ్యూల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ త‌న నోటిఫికేష‌న్‌లో ప్ర‌క‌టించింది.కేవ‌లం ప్రిలిమ్స్‌, మోయిన్స్ రాత ప‌రీక్ష‌ల ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించింది. మే 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అనుమతి ఇచ్చింది. ఇక గ్రూప్ 1లో ప్ర‌కటించిన ఉద్యోగాల్లో కేట‌గిరీల వారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి. 

డిప్యూటీ క‌లెక్ట‌ర్లు   42
డీఎస్సీలు      91
ఎంపీడీఓలు    121
సీటీఓలు    48
అసిస్టెంట్ ట్రెజ‌రీ ఆఫీస‌ర్లు   38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్లు    40
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు 26
మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ గ్రేడ్ 2     41
అసిస్టెంట్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్లు    8
ఆర్టీఓ     4
జిల్లా పంచాయ‌తీ ఆఫీస‌ర్లు   4
జిల్లా రిజిస్ట్రార్లు    5

  • Loading...

More Telugu News