Chiranjeevi: నాన్నగారి నుంచి నేర్చుకున్నది అదే: చరణ్

Acharya movie update

  • మొదటి నుంచి నాన్నను గమనిస్తూ వచ్చానన్న చరణ్  
  • ఆయన ఎప్పుడూ టైమ్ వేస్టు చేయరని కామెంట్ 
  • టైమ్ వేస్టు చేయడమంటే డబ్బు వృథా చేయడమేనని వ్యాఖ్య  
  • నాన్నగారు  చెప్పినట్టే చేస్తున్నానన్న చరణ్      

చిరంజీవి - చరణ్ కథానాయకులుగా 'ఆచార్య' రూపొందింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, మణిశర్మ దర్శకత్వం వహించాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
 
తాజా ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ వస్తున్నాను. ఆయన వెంట షూటింగ్స్ కి వెళుతూ గమనిస్తూ వచ్చాను. సమయాన్ని వృథా చేయడమంటే  .. డబ్బును వృథా చేయడమే అనేది నాన్నగారి ఆలోచన. సెట్లోకి అడుగుపెట్టిన తరువాత టైమ్ వేస్టు చేయకూడదనే ఆయన చెబుతుంటారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సీన్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. సెట్లో ఒక 10 నిమిషాలు వేస్టు చేస్తే, 3 నుంచి 4 లక్షల వరకూ వృథా అయినట్టే. సెట్లో మన కోసం ఎంతోమంది ఆర్టిస్టులు .. టెక్నీషియన్లు వెయిట్ చేస్తుంటారు. అందువల్లనే నేను ఎప్పుడూ టైమ్ వేస్టు చేయను. ఉదయం 6.30 గంటలకే సెట్లో ఉండేవాడిని" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News