Harish Rao: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది: హరీశ్ రావు
- దేశంలోని ఏ వర్గానికైనా ఉపయోగం కలిగిందా? అని హరీశ్ ప్రశ్న
- కేంద్రం ప్రభుత్వం ఉన్న సంస్థలను అమ్ముకుంటోందని విమర్శ
- బండి సంజయ్‌ది మేకపోతు గాంభీర్యమేనని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతోన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వల్ల దేశంలోని ఏ వర్గానికైనా ఉపయోగం కలిగిందా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థలను అమ్ముకుంటోందని, ఉద్యోగులను రోడ్డున పడేస్తోందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం గురించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో చెప్పడానికి ఏముందని ఆయన నిలదీశారు. ఆయనది కేవలం మేకపోతు గాంభీర్యమేనని, బీజేపీ ఎటువంటిదో బీజేపీ వాళ్లకే బాగా తెలుసని ఎద్దేవా చేశారు. కేంద్రం సర్కారు ప్రజల కోసం ఒక్క పనైనా చేసిందా? అని హరీశ్ రావు నిలదీశారు. ప్రధాని మోదీ నల్లధనం తీసుకువస్తామన్నారని, ఉద్యోగాలు ఇస్తామన్నారని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటయినా ఆయన నెరవేర్చారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.