Telangana: రేష‌న్ కార్డుల తొల‌గింపుపై తెలంగాణ స‌ర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

supreme court angry over telengana gevernment

  • 20 ల‌క్ష‌ల‌కు పైగా కార్డుల‌ను తొల‌గించిన స‌ర్కారు
  • కార్డుల తొల‌గింపుపై సుప్రీంకోర్టులో పిటిష‌న్‌
  • ఆధార్ కార్డు అనుసంధానించ‌ని కార్డుల‌నే తొల‌గించామ‌న్న స‌ర్కారు
  • ఆధార్ ప్రామాణికం కాద‌ని కేంద్ర‌మే చెప్పింద‌న్న కోర్టు
  • అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని స‌ర్కారుకు నోటీసులు

ల‌క్ష‌ల సంఖ్య‌లో రేష‌న్ కార్డుల‌ను తొల‌గించిన వ్య‌వ‌హారంపై తెలంగాణ స‌ర్కారుపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై మూడు వారాల్లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కూడా కోర్టు తెలంగాణ స‌ర్కారుకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల‌కు పైగా రేష‌న్ కార్డులు తొల‌గించారంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు బుధ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో రేష‌న్ కార్డుల‌ను ఎలా తొల‌గిస్తార‌ని సుప్రీంకోర్టు తెలంగాణ స‌ర్కారును ప్ర‌శ్నించింది. రేష‌న్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయ‌ని కార్డుల‌ను తొల‌గించామ‌ని చెప్పిన తెలంగాణ స‌ర్కారు త‌ర‌ఫు న్యాయ‌వాదిపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

 ఆధార్ కార్డు ప్రామాణికం కాదంటూ స్వ‌యంగా కేంద్ర ప్ర‌భుత్వమే చెప్పిన నేప‌థ్యంలో రేష‌న్ కార్డుల‌కు ఆధార్ కార్డుల అనుసంధానాన్ని త‌ప్ప‌నిస‌రి ఎలా చేస్తార‌ని కోర్టు నిల‌దీసింది. ఈ వ్య‌వ‌హారంపై మూడు వారాల్లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌న్న కోర్టు...విచార‌ణ‌ను 3 వారాల‌కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News