Telangana: మహేందర్ రెడ్డి ఆరోపణలపై తాండూర్ సీఐ స్పందన

Tandoor CI Responded On Allegations Of Mahender Reddy

  • ఆడియోలో ఉన్న వాయిస్ ఎవరిదో కోర్టే తేలుస్తుందన్న సీఐ 
  • ఇసుక దందా చేస్తున్నట్టు నిరూపించమనండని సవాల్ 
  • ఆయన బూతులు తిట్టడం బాధించిందన్న సీఐ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆరోపణలపై తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే, సీఐ కలిసి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఆడియోలో ఉన్న వాయిస్ ఎమ్మెల్సీదేనా? కాదా? అన్నది కోర్టే నిర్ణయిస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ బూతులు తిట్టడం కరెక్ట్ కాదని, తనకు బాధేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గతంలో ఎస్సైగా పనిచేసేటప్పుడూ ఇలాగే దుర్భాషలాడారని, కానీ, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఫిర్యాదు చేయలేదని అన్నారు. 

తిట్టలేదని ఆయన అంటున్నారు కదా.. అన్నీ దర్యాప్తులోనే తెలుస్తాయని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఉన్న రౌడీషీటర్లెవరో ఎమ్మెల్సీకే తెలియాలని అన్నారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేయలేదని చెప్పారు. గుడి కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ వంటి వాళ్లు వచ్చారన్నారు. రౌడీషీటర్లకు తాను ఎవరికి కొమ్ముకాస్తున్నానో మహేందర్ రెడ్డి చెప్పాలన్నారు. 

ఇసుక దందా చేస్తున్నట్టు ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తానేంటి.. ఎలా డ్యూటీ చేస్తున్నాననేది పెద్దాఫీసర్లకు తెలుసని చెప్పారు.

  • Loading...

More Telugu News