Kuldeep Yadav: కుల్దీప్ స్పిన్ మాయాజాలానికి కోల్ కతా విలవిల
- వాంఖెడేలో కోల్ కతా వర్సెస్ ఢిల్లీ
- టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 రన్స్
- 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన కుల్దీప్
- ముస్తాఫిజూర్ కు 3 వికెట్లు
ఎడమచేతివాటం రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ధాటికి కోల్ కతా నైట్ రైడర్స్ విలవిల్లాడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచిన ఈ మ్యాచ్ లో కోల్ కతా మొదట బ్యాటింగ్ చేసింది. కుల్దీప్ యాదవ్ కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా... కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ తన సంచలన స్పెల్ లో కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (42), బాబా ఇంద్రజిత్ (6), సునీల్ నరైన్ (0), ఆండ్రీ రస్సెల్ (0)లను పెవిలియన్ చేర్చి కోల్ కతాను గట్టి దెబ్బకొట్టాడు.
అయితే మిడిలార్డర్ లో నితీశ్ రాణా (57), లోయరార్డర్ లో రింకు సింగ్ (23) రాణించడంతో కోల్ కతా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మరోవైపు లెఫ్టార్మ్ సీమర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ కచ్చితత్వంతో కూడిన బంతులు వేయడంతో కోల్ కతా ఆఖరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయింది. కోల్ కతా జట్టులో నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్ మినహా మిగిలినవాళ్లు దారుణంగా విఫలమయ్యారు.