Swamy Chakrapai Maharaj: ఢిల్లీ పేరును మార్చాలి: స్వామి చక్రపాణి మహారాజ్
- ఢిల్లీ అసలు పేరు ఇంద్రప్రస్థ
- మహాభారతంలో కూడా ఇదే పేరు ఉంది
- ఇంద్రప్రస్థ అంటే ఇంద్రుడి రాజ్యం
దేశ రాజధాని ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని అఖిల భారత హిందూ మహాసభ, సంత్ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. పేరును మార్చాల్సిందిగా ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కోరారు. ఢిల్లీ పాత పేరు ఇంద్రప్రస్థ అని అని ఆయన చెప్పారు. ఇంద్రప్రస్థ అంటే ఇంద్రుని రాజ్యమని అన్నారు.
మహాభారతంలో సైతం దీని పేరును ఇంద్రప్రస్థగానే పేర్కొన్నారని తెలిపారు. తోమర్ కాలంలో ఒక రాజు వదులుగా ఉన్న ఇనుప కర్రను ఏర్పాటు చేశాడని... ప్రజలు దీన్ని ధిలి (వదులుగా) అని పిలిచేవారని... ఆ తర్వాత దిల్లీగా, ఢిల్లీగా మారిందని చెప్పారు. అయితే పేరు మార్పు విషయంలో ఢిల్లీ సీఎంఓ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.