Punjab Kings: లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ అమీతుమీ... టాసే కీలకం!
- పుణేలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
- ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న పంజాబ్
- మనీష్ పాండేను పక్కనబెట్టిన లక్నో
ఐపీఎల్ తాజా సీజన్ లో టాస్ గెలిచిన ఏ జట్టు కూడా మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడడంలేదు. ప్రత్యర్థి జట్టు ఎంత భారీస్కోరు చేసినా ఛేజ్ చేస్తున్నారు, లేకపోతే దరిదాపుల వరకు వస్తున్నారు. ముఖ్యంగా పిచ్ లు బ్యాటింగ్ కు విశేషంగా సహకరిస్తుండడంతో, ఏ జట్టు కెప్టెన్ కూడా పెద్దగా ఆలోచించకుండానే టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ ఎంచుకుంటున్నారు.
ఇవాళ పుణే ఎంసీఏ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కూడా టాస్ నెగ్గి బౌలింగే ఎంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో నెగ్గడం పంజాబ్ జట్టుకు అవసరం.
ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, లక్నో జట్టు మనీష్ పాండేను పక్కనబెట్టి ఆవేశ్ ఖాన్ ను తుది జట్టులోకి తీసుకుంది. టోర్నీలో ఇప్పటివరకు లక్నో జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించగా, పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది.