LSG: అతి కష్టమ్మీద 153 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
- పుణేలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
- రాణించిన బౌలర్లు
- రబాడాకు 4, చాహర్ కు 2 వికెట్లు
- 46 పరుగులు చేసిన డికాక్
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పరుగుల కోసం చెమటోడ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 46, దీపక్ హుడా 34 ఓ మోస్తరుగా రాణించారు. ఆఖర్లో దుష్మంత చమీర 17, మొహిసిన్ ఖాన్ 13(నాటౌట్), జాసన్ హోల్డర్ 11 పరుగులు చేయడంతో లక్నో జట్టుకు ఆమాత్రం స్కోరైనా వచ్చింది.
పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లతో లక్నో జట్టును హడలెత్తించాడు. రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఆరంభంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (6) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో లక్నో భారీ స్కోరు ఆశలను దెబ్బతీసింది. కృనాల్ పాండ్య (7), మార్కస్ స్టొయినిస్ (1) విఫలమయ్యారు.