YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి చేతులు జోడించిన మంత్రి వేణుగోపాలకృష్ణ

AP Minister Venu Gopala Krishna sat down at yv subbareddys feet
  • ఎ.వేమవరంలో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి సంస్మరణ కార్యక్రమం
  • చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారన్న మంత్రి
  • సుబ్బారెడ్డికి, జగన్‌కు ఎన్ని జన్మలైనా శిరసు వంచి నమస్కరిస్తానన్న మంత్రి వేణుగోపాలకృష్ణ
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకరిల్లి నమస్కరించారు. మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరంలో నిన్న చిట్టబ్బాయి సంస్మరణ నిర్వహించారు. కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వేదికపైనున్న సుబ్బారెడ్డి వద్దకు వెళ్లిన మంత్రి మోకాళ్లపై కూర్చుని నమస్కరించారు. చిట్టబ్బాయి కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించారని, అందుకు కారకులైన సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లకు ఎన్ని జన్మలైనా శెట్టి బలిజలుగా శిరస్సు వంచి నమస్కరిస్తానని మంత్రి వేణు మోకరిల్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
YV Subba Reddy
Chelluboina Venu Gopala Krishna
Andhra Pradesh
YSRCP
YS Jagan

More Telugu News