NTAGI: 12-17 ఏళ్ల లోపు వారికి అందుబాటులోకి మరో టీకా.. ‘కొవావ్యాక్స్‌’కు ఎన్‌టాగీ అనుమతి

NTAGI panel recommends inclusion of Covovax in vaccination drive for 12 to17 age group

  • సీరమ్ ఇనిస్టిట్యూట్ కొవావ్యాక్స్‌కు అనుమతి
  • వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చాలని సిఫార్సు
  • రెండు డోసుల మధ్య వ్యవధిని 9 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించే యోచన

కరోనా నాలుగో దశ ప్రమాదం పొంచి ఉందన్న వార్తల వేళ ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) శుభవార్త చెప్పింది. 12-17 ఏళ్ల లోపు వారికి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చిన కొవావ్యాక్స్‌ టీకాకు అనుమతి లభించింది. నిన్న సమావేశమైన ఎన్‌టాగీ కొవావ్యాక్స్‌ను కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కాగా, కొవిడ్ టీకా రెండో డోసు, ప్రికాషన్ డోసుల మధ్య విరామ సమయాన్ని తగ్గించే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.

ప్రస్తుతం ఈ రెండు డోసుల మధ్య వ్యవధి 9 నెలలు ఉండగా దీనిని ఆరు నెలలకు తగ్గించే అంశంపైనా చర్చ జరిగింది. అలాగే, విద్య, ఉద్యోగం, క్రీడలు, వాణిజ్య సమావేశాల కోసం విదేశాలకు వెళ్లే వారికి 9 నెలల విరామాన్ని తగ్గించి ప్రికాషన్ డోసు ఇవ్వాలన్న విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని సమాచారం.

  • Loading...

More Telugu News