Cheteshwar Pujara: కౌంటీ చాంపియన్‌షిప్‌లో చెలరేగిపోతున్న పుజారా.. హ్యాట్రిక్ సెంచరీ నమోదు
- ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పుజారా
- కౌంటీల్లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం
- వరుసగా మూడో సెంచరీ నమోదు చేసిన వైనం
- అంతకుముందు డెర్బీషైర్‌పై అజేయంగా డబుల్ సెంచరీ
ఇండియన్ టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇరగదీస్తున్నాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా నిన్న డుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో శతకాన్ని నమోదు చేశాడు. 162 బంతుల్లో 13 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు వోర్సెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (109) బాదిన పుజారా, డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా డబుల్ సెంచరీ (201) పరుగులు చేశాడు. ఫలితంగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో డబుల్ సెంచరీ నమోదు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా పుజారా రికార్డులకెక్కాడు.
అంతకుముందు మహమ్మద్ అజారుద్దీన్ ఈ ఘనత సాధించాడు. 1991లో లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగులు సాధించిన అజర్.. 1994లో డుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగులు చేశాడు. ఈ రెండు సార్లు అజర్ డెర్బీషైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడుతున్నాడు.