Karumuri Nageswar Rao: కేటీఆర్ స్నేహితుడు టీడీపీ వ్యక్తే అయ్యుండొచ్చు: మంత్రి కారుమూరి
- మెహర్బానీ కోసమే ఏపీ గురించి కేటీఆర్ మాట్లాడారు
- జగన్ గురించి మాట్లాడితే పెద్దవాడిని అయిపోతానని అనుకొని ఉండొచ్చు
- తెలంగాణ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి
ఏపీ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు ఏపీ మంత్రులు తప్పుపట్టారు. మరో మంత్రి కారుమూరి నాగేశ్వరారావు మాట్లాడుతూ, అనేక మంది మంత్రులు ఏపీకి వచ్చి అభినందిస్తున్నారని చెప్పారు. కేవలం మెహర్బానీ కోసమే కేటీఆర్ మాట్లాడారని అన్నారు. కేటీఆర్ ఆ విధంగా మాట్లాడక పోతే బాగుండేదని చెప్పారు.