OnePlus: రూ.20 వేలకే వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్

OnePlus launches its first ever phone under Rs 20000

  • 6జీబీ, 128జీబీ ధర రూ.19,999
  • 8జీబీ, 128జీబీ ధర రూ.21,999
  • నేటి నుంచి అమెజాన్, రిలయన్స్ స్టోర్లలో విక్రయాలు

వన్ ప్లస్ సంస్థ భారత మార్కెట్లో మొదటి సారి రూ.20,000 ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 ఇప్పటికే మార్కెట్లో ఉన్న విషయం తెలిసిందే. దీని ధర రూ.23,000-25,000 మధ్య ఉంది. ఇప్పుడు దీనికి లైట్ వెర్షన్ ను తీసుకొచ్చింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ పేరుతో ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీ, 128జీబీ వెర్షన్ ధర రూ.19,999. 8జీబీ, 128జీబీ వెర్షన్ ధర రూ.21,999. నేటి నుంచి (ఏప్రిల్ 30) అమెజాన్, వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్, ఇతర భాగస్వామ్య స్టోర్లలో వీటి విక్రయాలు మొదలవుతాయి. 

వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 33 వాట్ సూపర్ వూక్ చార్జర్ తో వస్తుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను వాడారు. రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ, రియల్ మీ 9 ప్రో 5జీలోనూ ఇదే చిప్ సెట్ ఉంది. 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్, పలు గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరా 64ఎంపీతో ఉంటుంది. సెల్పీ కోసం 16ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News