Lt Gen Manoj Pande: కొత్త సైన్యాధ్యడిగా జనరల్ మనోజ్ పాండే బాధ్యతల స్వీకరణ
- మూడేళ్ల పాటు సేవలు
- ముగిసిన నరవణే పదవీ కాలం
- ఆర్మీ ఇంజనీర్ కార్ప్స్ నుంచి ఉన్నత పదవిని చేపట్టిన తొలి వ్యక్తి
- వైస్ చీఫ్ గా బీఎస్ రాజు
ఆర్మీ కొత్త చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. దీంతో సైన్యాధ్యక్షుడిగా నరవణే పదవీ కాలం ముగిసినట్టయింది. ఇప్పటి వరకు జనరల్ మనోజ్ పాండే ఆర్మీ ఉప చీఫ్ గా పనిచేశారు. ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనకు పదోన్నతి దక్కింది.