EV fire: ప్రతీ ఎలక్ట్రిక్ వాహన ప్రమాదంపై లోతైన దర్యాప్తు: కేంద్రం
- తయారీదారులు తగిన ప్రమాణాలు పాటించాలి
- భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి
- కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి గిరిధర్
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో (ఈవీలు) అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా.. ప్రతి ప్రమాదం విషయమై లోతైన దర్యాప్తు చేయిస్తామని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనే తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ ఇంకా నివేదిక సమర్పించలేదని చెప్పారు. భారత ఈవీ పరిశ్రమ ఎంతో వృద్ధిని చూస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన ఊహలకూ కూడా అందననంతగా ఇది ఉంటుందన్నారు.