ICMR: కరోనా ఫోర్త్ వేవ్ పై మరింత స్పష్టత నిచ్చిన ఐసీఎంఆర్

ICMR clarifies there is no fourth wave in country
  • దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
  • ఫోర్త్ వేవ్ అంటూ జరుగుతున్న ప్రచారం
  • కొన్ని జిల్లాల్లోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయన్న ఐసీఎంఆర్
  • తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నారని వివరణ 
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఫోర్త్ వేవ్ కు సంకేతమంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) స్పందించింది. కరోనా ఫోర్త్ వేవ్ పై భయాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. కేవలం కొన్ని జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న విషయాన్ని ఇటీవలి డేటా వెల్లడిస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది. దీన్ని ఫోర్త్ వేవ్ గా భావించలేమని, కొన్నిచోట్ల స్థానికంగా కేసులు ఎక్కువ వస్తున్నాయని వివరణ ఇచ్చింది. 

ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడంలేదని అన్నారు. తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేసినప్పుడు వచ్చే పాజటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉన్నదని చెప్పలేమని తెలిపారు. అధిక సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తేనే అక్కడ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు భావించాలని వివరించారు.
ICMR
Corona Virus
Fourth Wave
India

More Telugu News