Heatwave: నేటి నుంచి తగ్గనున్న ఎండల తీవ్రత: భారత వాతావరణ శాఖ

Heatwave may abate from today mercury likely to dip

  • మూడు రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు
  • 2-4 డిగ్రీలు తక్కువగా నమోదు
  • పలు చోట్ల ఉరుములతో వర్షాలు
  • వాతావరణ శాఖ అంచనాలు

వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించే విషయాన్ని భారత వాతావరణ శాఖ చెప్పింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పడతాయని ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 

ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, దక్షిణ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 2వ తేదీ నుంచి వేడి తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ ట్విట్టర్లో ప్రకటించింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్ లోని పశ్చిమ భాగం, మహారాష్ట్రలోని విదర్భ మినహా దేశంలో మరెక్కడా వడగాలులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ ఆర్కే జెనామణి తెలిపారు. 

  • Loading...

More Telugu News