Andhra Pradesh: ఏపీలో 22 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు!

GST collections in AP and TS increased

  • ఏపీలో ఏప్రిల్ లో రూ. 4,262 కోట్ల వసూళ్లు
  • తెలంగాణలో సైతం 16 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
  • ఏప్రిల్ లో దేశ వ్యాప్తంగా రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

ఏపీలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్లో నెలలో వసూలైన జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ వసూళ్లు 22 శాతం పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ లో రూ. 3,345 కోట్లు వసూలు కాగా... ఈ ఏడాది రూ. 4,262 కోట్లు వసూలయ్యాయి. 

తెలంగాణలో సైతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2021 ఏప్రిల్ లో టీఎస్ లో రూ. 4,262 కోట్లు వసూలు కాగా... ఈ ఏడాది ఏప్రిల్ లో రూ. 4,955 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. ఇక దేశ వ్యాప్తంగా ఈ ఏప్రిల్ లో రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయింది.

  • Loading...

More Telugu News