Prashant Kishor: ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం వచ్చిందంటూ ప్రశాంత్ కిశోర్ ప్రకటన!
- పదేళ్లుగా తాను ప్రజల పక్షాన విధానాలు రూపొందించానన్న పీకే
- అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని వ్యాఖ్య
- ప్రజా సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉందన్న ప్రశాంత్
- బీహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటన
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా సంకేతం ఇచ్చారు. పదేళ్లుగా తాను ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉందని, ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు.
సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నానని, బీహార్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు. కాగా, తాను కాంగ్రెస్‌లో చేరబోనని ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్‌లో తన రాజకీయ కార్యకలాపాల కోసం ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.