MS Dhoni: ‘మైండ్’ పెట్టి బౌలింగ్ చెయ్.. ముకేశ్ పై ఆగ్రహించిన ధోనీ.. వీడియో ఇదిగో
- చివరి ఓవర్లో వైడ్ బంతి వేసిన ముకేశ్
- సహనం కోల్పోయిన ధోనీ
- తలపై వేలు పెట్టి సైగలతో హెచ్చరిక
- మైదానంలోని బోర్డును చూపిస్తూ సూచన
మిష్టర్ కెప్టెన్ కూల్.. ఇది ఎంఎస్ ధోనీకి ఉన్న పేరు. ఎంత ఒత్తిడి ఉన్నా కొంచెం కూడా పైకి కనిపించకుండా.. కూల్ గా జట్టును విజయతీరాలకు చేర్చడంలో ఆయన అంత పండితుడైన భారత క్రికెటర్ మరొకరు లేరనడంలో అతిశయోక్తి లేదు. అటువంటిది ఆదివారం సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా ధోనీలో కోపం కట్టలు తెంచుకుంది.
చివరి ఓవర్ బౌలింగ్ ను ధోనీ.. ముకేశ్ చౌదరికి అప్పగించాడు. సన్ రైజర్స్ విజయానికి 36 పరుగులు కావాలి. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా బౌలింగ్ చేయాలని ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ముకేశ్ బౌలింగ్ లో పూరన్ 6, 4, 6, 6 ఇలా చెలరేగిపోయాడు. అయినా ధోనీ సహనాన్ని కోల్పోలేదు.
కానీ, ఒక్క బంతి కూడా కీలకంగా మారిన సమయంలో ముకేశ్ చౌదరి వైడ్ బంతి వదిలాడు. దీంతో ధోనీ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. మైండ్ పెట్టుకుని బౌలింగ్ చేయి అన్నట్టుగా వేలును తలపై పెట్టుకుని సైగ చేశాడు. మైదానంలో బోర్డుపై ఎన్ని బంతులకు, ఎన్ని పరుగులు కావాలన్న గణాంకాలు చూపిస్తూ జాగ్రత్తగా బౌలింగ్ చేయాలని సూచించాడు.