Suma: నేను ఎవరి పొట్టా కొట్టడం లేదు: యాంకర్ సుమ

Suma Interview
  • తాను ఎవరికీ పోటీకాదన్న సుమ 
  • యాంకర్స్ అంతా తనతో ఫ్రెండ్లీగా ఉంటారని వెల్లడి 
  • ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్లదంటూ వివరణ 
  • ఎవరి అవకాశాలు వాళ్లకి ఉంటాయంటూ స్పష్టీకరణ
బుల్లితెరపై యాంకర్ గా .. హోస్ట్ గా సుమ ఫుల్ బిజీ. సుమతో పాటు చాలామంది యాంకర్లు వచ్చారు .. పోయారు. కానీ సుమ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎదురులేని ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'జయమ్మ పంచాయితీ' ఈ నెల 6వ తేదీన థియేటర్లకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. పరోక్షంగా చాలామంది యాంకర్ల పొట్టకొడుతున్నారే అనే విమర్శ , తాజా ఇంటర్వ్యూలో సుమకి ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. "నేను  ఎవరినీ తొక్కేయలేదు .. ఎవరి పొట్టా కొట్టడం లేదు. నేను నాకు వచ్చే ఈవెంట్లు తగ్గించుకుంటే నా ఈ ఎమ్ ఐలు మీరు కడతారా?

నా పిల్లల ఫీజులు మీరు కడతారా?  లేదుకదా? మరి అలాంటప్పుడు నా కష్టమేదో నేను పడాలిగదా? యాంకర్స్ అంతా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఎవరి టాలెంట్ వారికి ఉంది .. ఎవరి స్టైల్ వారికి ఉంది. వాళ్లకి రావలసిన అవకాశాలు వాళ్లకి వస్తుంటాయి. వాళ్లందరి స్టయిల్ ను నేను లైక్ చేస్తుంటాను" అని చెప్పుకొచ్చింది.
Suma
Vijay Kumar
Jayamma panchayithi Movie

More Telugu News