Chandrababu: రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu to tour Srikakulam district tomorrow

  • ఆముదాలవలస నియోజకవర్గం దల్లవలస గ్రామంలో పర్యటించనున్న చంద్రబాబు
  • ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకోనున్న బాబు
  • రాత్రికి ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామంలో ఆయన పర్యటించబోతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ఆయన ప్రజా సమస్యలను అడిగి తెలుకోనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గ్రామసభను నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు, నిత్యావసర ధరల పెరుగుదల వంటివాటిని ప్రజలకు వివరించనున్నారు. అనంతరం గ్రామంలోని దళిత, బడుగు, బలహీనవర్గాల ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News