YS Vivekananda Reddy: హైకోర్టుకు వివేకా కూతురు సునీత... నిందితుల బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా
- బెయిల్ ఇవ్వాలంటూ అనిల్, ఉమాశంకర్‌ల పిటిషన్
- నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు
- శుక్రవారం వాదనలు వినిపించనున్న సీబీఐ తరఫు లాయర్లు
- ఇరు వర్గాల వాదనలు వినేందుకే కోర్టుకు సునీత
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు వివేకా కూతురు సునీత స్వయంగా హాజరయ్యారు. నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా నిందితుల, సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలను స్వయంగా పరిశీలించేందుకే సునీత కోర్టుకు వచ్చారు.
ఈ విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు... విచారణను ఎల్లుండి (శుక్రవారం)కి వాయిదా వేసింది. శుక్రవారం నాడు సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలు విననున్నట్లు కోర్టు ప్రకటించింది. సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం నిందితులు అనిల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిల బెయిల్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.