Zomato: మురిపించి నిండా ముంచిన జొమాటో షేరు!

Zomato on cash burning spree erases Rs 88000 crore m cap in 6 months

  • గతేడాది జులైలో ఐపీవో
  • ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.76
  • లిస్ట్ అయిన తర్వాత రూ.169 వరకు చలనం
  • ప్రస్తుత ధర రూ.59

మొబైల్ లో యాప్ తెరిచి ఆర్డర్ చేస్తే 30 నిమిషాల్లో కోరుకున్న టేస్టీ ఫుడ్ డోర్ ముందుకు వచ్చేస్తుంది. ఈ సేవలు అందించే జొమాటో ఐపీవోకు వస్తుందనగానే రిటైల్ ఇన్వెస్టర్లు ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టారు. ఐపీవోలో ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.76. 2021 జూలై 16న ఇష్యూ ముగిసింది. వారం రోజుల తర్వాత రూ.115 వద్ద లిస్ట్ అయిన షేరు ఇన్వెస్టర్లకు మంచి లాభాలు కురిపించింది. ఐపీవోలో షేరు దక్కని వారు సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఇనిస్టిట్యూషన్స్ కూడా జొమాటో షేరును లవ్ చేశాయి.

దీంతో 2021 నవంబర్ లో జొమాటో షేరు ధర రూ.169 గరిష్ఠ స్థాయిని చూసింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ షేరు కొద్ది కొద్దిగా నేల చూపులు చూస్తూ ఎప్పటికప్పుడు కొత్త కనిష్ఠాలకు వెళుతోంది. దీంతో గరిష్ఠ ధరల వద్ద ఈ షేరును కొనుగోలు చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు.

జొమాటో శుక్రవారం నాటి షేరు ధర రూ.59. ఐపీవో ధర రూ.76తో పోల్చి చూస్తే 20 శాతం తక్కువ. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.169 నుంచి చూస్తే 65 శాతం తక్కువ. ఈ షేరుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 2021 నవంబర్ లో రూ.220 టార్గెట్ ఇచ్చింది. అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు రూ.170 వరకు ఇచ్చాయి. కానీ, ఆ లక్ష్యాలను ఎప్పుడు చేరుకుంటుందో? కాలమే చెప్పాలి.

ఇప్పటి వరకు ఏ ధరలో పెట్టుబడి పెట్టినా.. అందరికీ ఈ షేరు నష్టాలనే ఇచ్చింది. కానీ, స్టాక్ మార్కెట్ లో విజయవంతమైన బఫెట్ సూత్రాన్ని ఒకటి గుర్తు చేయాలి. ‘అందరూ భయంతో అమ్ముతున్న వేళ కొనుగోలు చేయాలి. అందరూ వెర్రితనంతో కొనుగోలు చేస్తున్న సమయంలో విక్రయించాలి’. అంటే జొమాటోలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారు చౌకగా లభిస్తున్న ఇప్పుడు పరిశీలించొచ్చు. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ మంది బఫెట్ సూత్రానికి విరుద్ధంగా ప్రయాణం చేస్తుంటారు.

  • Loading...

More Telugu News