Apple: కార్డ్ పేమెంట్స్ నిలిపివేసిన యాపిల్
- ఆర్ బీఐ ఆటో డెబిట్ నిబంధనల వల్లే
- నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐతో చేసుకోవచ్చు
- యాపిల్ ఐడీ బ్యాలన్స్ నుంచి చెల్లింపులు
యాప్ స్టోర్లో కొనుగోళ్లకు కార్డు చెల్లింపులను స్వీకరించడాన్ని యాపిల్ నిలిపివేసింది. అలాగే సబ్ స్క్రిప్షన్లకూ ఇదే నిర్ణయాన్ని అమలు చేసింది. భారత్ లో యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి చేసే కొనుగోళ్లకు క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేయలేరు. ఆర్బీఐ గతేడాది తీసుకొచ్చిన ఆటో డెబిట్ నిబంధనల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
యాపిల్ సేవలను సబ్ స్క్రయిబ్ చేసుకోవాలన్నా, యాప్ స్టోర్ నుంచి కొనుగోళ్లు చేసుకోవాలన్నా నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా యాపిల్ ఐడీ బ్యాలన్స్ రూపంలో చేసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ ఐడీ అకౌంట్ కు లోగడ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేసి, ఆటో డెబిట్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా లావాదేవీలు ప్రాసెస్ కావు. కనుక యూజర్లు నెట్ బ్యాంకింగ్, యూపీఐ సాయంతో యాపిల్ ఐడీకి బ్యాలన్స్ యాడ్ చేసుకుని కొనుగోళ్లు చేసుకోవచ్చు.