Suma: 'జయమ్మ పంచాయతి' షూటింగ్ లో కాలు జారి పడ్డ సుమ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో ఇదిగో!

Anchor Suma narrowly escapes accident during Jayamma Panchayathi shooting

  • ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న చిత్ర యూనిట్
  • నిన్న విడుదలైన 'జయమ్మ పంచాయతి'
  • ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న చిత్రం

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ 'జయమ్మ పంచాయతి' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం ఆకట్టుకుంది. మరోవైపు ఈ షూటింగ్ సందర్భంలో సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చున్న ఆమె కాలు జారి కింద పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News