Devineni Uma: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై దేవినేని ఉమ స్పందన

Devineni Uma reacts to Narayana arrest issue

  • ఇటీవల ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్
  • హైదరాబాదులో నారాయణ అరెస్ట్
  • మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • కక్షసాధింపు చర్యల్లో భాగమేనన్న ఉమ

ఇటీవల ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన వ్యవహారంలో ఏపీ సీఐడీ పోలీసులు మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇటీవల సీఎం జగన్ తిరుపతిలో మాట్లాడుతూ, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల హస్తం ఉందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, నేడు నారాయణ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందించారు. మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. దీన్ని తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని ఉమ మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీసీ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందని విమర్శించారు. 'మీ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు జగన్' అంటూ ఉమ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News