Telangana: త‌మిళ‌నాడు పర్యటనకు తెలంగాణ బీసీ క‌మిష‌న్‌ సభ్యులు... ఎందుకోస‌మంటే!

telangana bc commisiion tour in tamilnadu from tomorrow

  • రిజ‌ర్వేష‌న్ల శాతాన్ని పెంచే దిశ‌గా తెలంగాణ స‌ర్కారు
  • త‌మిళ‌నాడులో 69 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లు
  • త‌మిళ‌నాడు స్థితిగ‌తుల ప‌రిశీల‌న‌కే బీసీ క‌మిష‌న్ ప‌ర్య‌ట‌న‌
  • మూడు రోజుల పాటు కొన‌సాగ‌నున్న ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ బీసీ క‌మిష‌న్ బుధ‌వారం త‌మిళ‌నాడు రాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. రేప‌టి నుంచి మూడు రోజుల పాటు త‌మిళ‌నాడు రాష్ట్రంలో తెలంగాణ బీసీ క‌మిష‌న్ ప‌ర్య‌టించ‌నుంది. ఈ మేర‌కు బీసీ క‌మిష‌న్ స‌భ్యుడు కిశోర్ గౌడ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

ఏ రాష్ట్రంలో అయినా రిజ‌ర్వేష‌న్ల శాతం 50కి మించ‌రాద‌న్న నిబంధ‌న ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నిబంధ‌న కార‌ణంగా మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచేందుకు తెలంగాణ‌కు అవ‌కాశం చిక్క‌డం లేదు. అదే విధంగా బీసీల్లో పెరిగిన జ‌నాభా దామాషా ప్ర‌కారం ఆ వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ల శాతాన్ని పెంచే దిశ‌గానూ కేసీఆర్ స‌ర్కారుకు వీలు ప‌డ‌టం లేదు. దీంతో ఇత‌ర రాష్ట్రాల్లో రిజ‌ర్వేష‌న్ల ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న అంశంపై కేసీఆర్ స‌ర్కారు దృష్టి సారించింది.

ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడులో 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అవుతున్నాయి. ఏకంగా ఆ రాష్ట్రంలో 69 శాతం మేర రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అవుతున్నాయి. ఈ దిశ‌గా 50 శాతానికి మించి అద‌నంగా 19 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను త‌మిళ‌నాడు ఎలాంటి న్యాయ వివాదా‌లు రాకుండా ఎలా అమ‌లు చేస్తున్న‌ద‌న్న దానిపై అధ్య‌య‌నానికి తెలంగాణ స‌ర్కారు సిద్ధ‌ప‌డింది. ఇందులో భాగంగా బీసీ క‌మిష‌న్‌ను ఈ అధ్య‌య‌నం కోసం త‌మిళ‌నాడు పంపుతోంది. త‌మిళ‌నాడులో జ‌ర‌పనున్న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆ రాష్ట్రంలో నిర్దేశిత ప‌రిమితికి మించి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అవుతున్న తీరుపై తెలంగాణ బీసీ క‌మిష‌న్ స‌మ‌గ్ర అధ్య‌య‌నం జ‌రప‌నుంది.

  • Loading...

More Telugu News